Raghava Lawrence: ఆ విద్యార్థిని చదువుకు సాయం చేస్తున్న లారెన్స్ కొడుకు.. గ్రేట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో లారెన్స్ (Raghava Lawrence) ఒకరు కాగా లారెన్స్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లారెన్స్ తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. లారెన్స్ తమ్ముడు త్వరలో ఒక సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానుండగా తాజాగా లారెన్స్ తన వారసుడిని పరిచయం చేయడం గమనార్హం. లారెన్స్ తన ట్విట్టర్ పోస్ట్ లో “ఫ్యాన్స్ కు, స్నేహితులకు విన్నపం.. వీడు మా అబ్బాయి శ్యామ్.. అప్పుడే పెద్దవాడు అయిపోయాడు..

ప్రస్తుతం శ్యామ్ కాలేజ్ లో థర్డ్ ఇయర్ చదువుతూ అదే సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు.. హెప్సిబా అనే విద్యార్థిని చదువు కోసం శ్యామ్ ఈ ఏడాది స్కూల్ ఫీజును చెల్లించాడు.. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.. ఇకపై శ్యామ్ తన సేవా యాత్రను కొనసాగిస్తాడు.. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలి” అని పేర్కొన్నారు. రాఘవ లారెన్స్ ఇప్పటివరకు ఎంతోమందికి సహాయం చేశారనే సంగతి తెలిసిందే.

తాను నడిచిన మార్గంలోనే లారెన్స్ తన కొడుకును కూడా నడిపించాలని ఫీలవుతున్నారు. ఈ విషయం తెలిసిన లారెన్స్, శ్యామ్ సేవా గుణాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. లారెన్స్ స్పీడ్ డ్యాన్సర్ అనే సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టడం గమనార్హం. కాంచన సిరీస్ సినిమాలు లారెన్స్ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.

ప్రస్తుతం లారెన్స్ దుర్గ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. లారెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. లారెన్స్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus