ఇది వర్కౌట్ అయ్యే పనేనా లారెన్స్ గారూ..?

రాఘవ లారెన్స్ రూపొందిస్తున్న ముని సీక్వెల్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో భాగంగా వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలో ‘కాంచన 3’ (ముని 4) చిత్రం కూడా ఈ సమ్మర్ కి రానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టే ఏప్రిల్ 19 న (ఈరోజు) భారీ ఎత్తున విడుదలవుతుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకి ‘స్టైల్’ నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా హాజరయ్యాడు.

13 ఏళ్ళ క్రితం వచ్చిన స్టైల్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి, నాగార్జున లాంటి బడా హీరోలని ఓ చిత్రంలో చూపించిన ఘనత కూడా లారెన్స్ కే దక్కిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే తరువాత దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ వేడుకలో ఈ సీక్వెల్ గురించి లారెన్స్ ప్రస్థావిస్తూ… ” లగడపాటి శ్రీధర్ గారితో ‘స్టైల్’ సినిమా చేశాను. ఇప్పుడు ఆయనే స్టైల్ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. అయితే డ్యాన్స్ సినిమా చేయాలంటే మంచి డ్యాన్సర్స్ కావాలి. ఇక్కడ బాగా డ్యాన్స్ చేసే వాళ్ళలో బన్ని- చరణ్- తారక్ ఉన్నారు. వాళ్లే తోపు డ్యాన్సర్లు. అన్నయ్య (చిరంజీవి) గురించి ఈ సందర్భం లో చెప్పలేదని అనుకోవద్దు.. ఎందుకంటే వీటన్నిటికీ బాస్. కాబట్టి స్టైల్ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలతో ప్లాన్ చేయాలి” అంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు. లారెన్స్ ఇలా చెప్పాడో లేదో సోషల్ మీడియాలో ఇదే టాపిక్ వైరలవుతుంది. ప్రతీ ఒక్కరు ‘స్టైల్’ సీక్వెల్ గురించి మాట్లాడుతున్నారు. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ నిజంగా వర్కౌటయితే భారీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus