ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు దర్శకుల మూవీ మళ్ళీ తెరపైకి!

  • May 29, 2020 / 03:50 PM IST

శతాధిక చిత్రాల దర్శకుడిగా ఉన్న రాఘవేంద్ర రావు యంగ్ జనరేషన్ తో కూడా పోటీ పడి భారీ హిట్స్ అందుకున్నారు. దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఉన్నారు. కాగా ఈయన మెగా ఫోన్ పట్టి చాలా కాలం అవుతుంది. 2017లో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలలో వచ్చిన భక్తి రస చిత్రం ఓమ్ నమో వెంకటేశా చివరి చిత్రం. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అంతగా విజయం సాధించలేదు. కొంత కాంలగా ఆయన ఎక్కువ భక్తి రస చిత్రాలను తెరకెక్కించడం జరిగింది.

బాలయ్యతో పాండురంగడు, నాగార్జునతో షిరిడీ సాయి చిత్రాలు చేశారు. ఐతే ఆ చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల వలె ఆదరణ దక్కించుకోలేదు. కాగా రాఘవేంద్ర రావు గత ఏడాది ఎన్టీఆర్ జయంతి నాడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు డైరెక్టర్స్ తో ఆ మూవీ తెరకెక్కనుంది ఆయన వెల్లడించారు. ఆ సినిమాకు ఆయన ఆ ముగ్గురు దర్శకులలో ఒకరిగా మరియు నిర్మాతగా ఉంటారని వార్తలు వచ్చాయి. ప్రకటన అయితే చేశారు కాని దానిపై ఎటువంటి అప్డేట్ రాలేదు.

ఇక ఈ మూవీ లేనట్లే అని అందరూ అనుకుంటున్న తరుణంలో సరిగ్గా ఏడాది తరువాత మళ్ళీ ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన ఈ మూవీ ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అప్డేట్ ఉంటుంది అని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కాగా ఆ ముగ్గురు దర్శకులలో ఒకరు క్రిష్ అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో హీరోగా నాగ శౌర్య చేస్తున్నారని అప్పుడు వార్తలు వచ్చాయి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus