ఆమె స్క్రిప్ట్ రాసిన సినిమాలన్నీ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నాయి

రైటర్ గా కంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడలిగా అందరికీ సుపరిచితురాలైన కనికా థిల్లాన్ ఆల్రెడీ తెలుగులో “సైజ్ జీరో” సినిమాతో రైటర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించ్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. అనంతరం బాలీవుడ్ లో “మన్మర్జియా” అనే చిత్రానికి కథ అందించి.. ఆ సినిమా ద్వారా సిక్కుల మనోభావాలు దెబ్బ తీసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను మెచ్చుకొన్నవాళ్లకంటే.. దుమ్మెత్తిపోసినవాళ్లే ఎక్కువ.

ఇప్పుడు తాజాగా ఆమె కథ అందించిన మరో చిత్రం “మెంటల్ హై క్యా?” కూడా వివాదంలో నిలిచింది. ఆ సినిమా పోస్టర్ & టీజర్ చూసినవాళ్ళందరూ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం సరికాదని, మెంటల్ పేషెంట్స్ లేదా ఆ రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా ఉందని సీ.బి.ఎఫ్.సి మొదలుకొని పలు సంస్థలు కాస్త గట్టిగానే పేర్కొన్నాయి. ఆఖరికి సినిమా సినిమా విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు మార్చాల్సి వచ్చింది. రాజ్ కుమార్ రావు, కంగనా రనౌత్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దాంతో ఈ సినిమాకి “సెంటిమెంటల్ హై క్యా?” అనే టైటిల్ ను ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా విడుదలయ్యాక విజయం సాధిస్తుందో లేక కనికా థిల్లాన్ మునుపటి సినిమాల వలె విడుదల ముందు హడావుడి చేసి.. రిలీజ్ అయ్యాక సైలెంట్ అయిపోతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus