విశ్వక్ అలాంటి వ్యక్తి అంటున్న రాహుల్ రామకృష్ణ!

ప్రముఖ ఛానల్ డిబేట్ లో దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్ల గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నెటిజన్లలో ఎక్కువమంది విశ్వక్ సేన్ కు మద్దతు ప్రకటిస్తుండగా సెలబ్రిటీల నుంచి కూడా విశ్వక్ సేన్ కు మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన రాహుల్ రామకృష్ణ విశ్వక్ సేన్ కు మద్దతు ప్రకటించారు.

రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కాలంలో జాతిరత్నాలు, ఆర్ఆర్ఆర్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలలో రాహుల్ పాత్రలకు ప్రశంసలు దక్కాయి. రాహుల్ కు మరికొన్ని భారీ బడ్జెట్ తెలుగు సినిమాలలో కూడా ఆఫర్లు వచ్చాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రాహుల్ రామకృష్ణ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయితే విశ్వక్ సేన్ వివాదం విషయంలో మాత్రం రాహుల్ రామకృష్ణ ఒకింత ఘాటుగా స్పందించారు. రాహుల్ రామకృష్ణ ఆ ఛానల్ నీచ స్వభావం గురించి ఎవరూ ప్రస్తావించరని మాకు వార్తలు చూపే విషయంలో వాళ్లు శ్రద్ధ వహిస్తామని కలరింగ్ ఇస్తారని ఆయన అన్నారు. వాళ్లు నిజాలు పట్టించుకోరని సదరు ఛానల్ కు మంచి నిధులు వస్తాయని రాహుల్ రామకృష్ణ కామెంట్లు చేయడం గమనార్హం.

విశ్వక్ సేన్ నిరాడంబరమైన వ్యక్తి అని అతనిని చుట్టుముట్టి అవమానపరుస్తున్నారని రాహుల్ రామకృష్ణ అన్నారు. విశ్వక్ సేన్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ రామకృష్ణ కామెంట్లు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ సైతం విశ్వక్ సేన్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్ల కోసమే ప్రాంక్ చేశారని అంతకు మించి అతను ఏ తప్పు చేయలేదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ వివాదంలో ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus