ఆ కుర్రాడికి మళ్లీ కలసి వచ్చింది!!!

యూట్యూబ్ మెగా స్టార్ రాజ్ తరుణ్….దర్శకుడిగా మారాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా హీరో అయిపోయాడు. వరుస హిట్స్ తో ప్రస్తుతం ఈ యువ హీరో మంచి జోరుగా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తొలి 4 సినిమాలు సోలో హీరోగానే నటించిన ఈ కుర్ర హీరో మంచు వారి వారసుడు మంచు విష్ణుతో నటించిన “ఆడోరకం ఈడోరకం” మూవీ బాక్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా రాజ్ తరుణ్ కి మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా రాజ్ తరుణ్ కు ప్లస్ అవడానికి ముఖ్య కారణం మంచు విష్ణు వంటి స్టార్ హీరోతో నటించటం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెచ్చిపెడుతున్న కలెక్షన్స్ ను చూసి దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు సినిమా నిర్మాత దర్శకుడు. అయితే ప్రస్తుతం సీక్వెల్ పరిస్థితి ఎలా ఉందో కిక్, సర్దార్ లాంటి సినిమాలు మనకు కళ్ళకు కట్టినట్లు చూపించడంతో, సీక్వెల్ కంటే మరో డిఫ్రెంట్ మూవీనే ప్లాన్ చేస్తే ఎలా ఉటుంది? అంటూ ఆలోచిస్తున్నారు. అంటే ఈ వివరాల ప్రకారం చూస్తే రాజ్ తరుణ్, మళ్ళీ ముంచు విష్ణు తో కలసి నటించనున్నాడు అన్న మాట… ప్రస్తుతం రాజ్ తరుణ్ సైతం కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. తను చేసిన సోలో సినిమాల కంటే ఇప్పడు  చేస్తున్న స్టార్ హీరో కాంబినేషన్ సినమాలు తన మార్కెట్ ని పెంచుతున్నాయని భావిస్తున్నాడు. ఇక మరోవైపు నాని, రాజ్ తరుణ్ కాంబినేషన్ లోనూ డైరెక్టర్స్ కథలని రెడీ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి చేస్తే కచ్ఛితంగా మంచి కమర్షియల్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఇలా యువ హీరోలతో ఈ కుర్ర హీరోని జతచేసి తక్కువ బడ్జెట్ తో భారీ హిట్స్ కొట్టడమే కాకుండా కమర్షియల్ గా సైతం సక్సెస్ సాధించ వచ్చు అన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు సినీనిర్మాతలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus