రాజ్ తరుణ్ కొత్తింట్లో అవికా గోర్!

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఆ తరువాత వరుస హిట్లు రావడంతో బిజీ హీరోగా మారాడు. కానీ తన సక్సెస్ రేట్ ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాడు. ప్లాప్ లు రావడంతో డీలా పడ్డాడు. రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా కాస్త ఊరటని కలిగించింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ హీరో కొత్తిల్లు కొనుక్కున్నాడు.

కొన్నేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటోన్న రాజ్ తరుణ్ అన్ని సౌకర్యాలు గల లగ్జరీ ఇంటిని తన సొంతం చేసుకున్నాడు. గృహ ప్రవేశ వేడుకను గ్రాండ్ గా జరిపించాడు. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి అతడి సన్నిహితులు హాజరయ్యారు. తన తొలి హీరోయిన్ అవికా గోర్ ఫంక్షన్ కి రావడంతో రాజ్ తరుణ్ ఆమెకి స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ లో అవికాతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ”నా మొదటి సినిమా నుండి ఇంటి గృహప్రవేశం వరకు.. అంతటా ఉన్నందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ చూసిన అవికా.. ‘హ్యాపీ టియర్స్’ అంటూ కామెంట్ పెట్టింది. అవికాతో పాటు తనకు ‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. మొత్తానికి రాజ్ తరుణ్ ఇన్నాళ్లకు తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus