Paanch Minar: వారం రోజులకే ఓటీటీకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’

రాజ్ తరుణ్ హీరోగా ‘పాంచ్ మినార్’ అనే సినిమా రూపొందింది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. రాజ్ తరుణ్ గత 5,6 ఏళ్ళలో చేసిన సినిమాలన్నిటి కంటే ‘పాంచ్ మినార్’ చాలా బెటర్ మూవీ అని అంతా అభిప్రాయపడ్డారు. కామెడీ, సస్పెన్స్ వంటి ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు.

Paanch Minar

అయితే ఆ పాజిటివ్ టాక్ అలా బయటకు వెళ్లేలోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసి పెద్ద షాక్ ఇచ్చింది. అవును ‘పాంచ్ మినార్’ సినిమా ఈరోజు అనగా నవంబర్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.కేవలం వారం రోజులకే ఓటీటీకి వచ్చేయడం ఇప్పుడు కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి. పైగా ‘పాంచ్ మినార్’ వంటి సినిమా కొంచెం బెటర్ టాక్ తెచ్చుకున్నా.. ఇలా 7 రోజుల థియేట్రికల్ రన్ కే ఓటీటీకి ఇచ్చేయడం పై నిర్మాతల్ని కొందరు విమర్శిస్తున్నారు.

అయితే ‘పాంచ్ మినార్’ సినిమాని డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేయడానికే మేకర్స్ రెడీ అయ్యుంటారు. కానీ ఈ మధ్య ఓటీటీ అప్రూవల్ లేని కంటెంట్ సినిమాలకు.. థియేట్రికల్ రిలీజ్ తప్పనిసరి అనే నిబంధన ఉంది. కేవలం దానికి కట్టుబడి మాత్రమే మేకర్స్ ‘పాంచ్ మినార్’ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసి ఉండొచ్చు. పైగా రాజ్ తరుణ్ వంటి హీరోల సినిమాలను థియేటర్లలో కంటే కూడా ఓటీటీల్లోనే ఎక్కువ మంది చూస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus