పవర్ ప్లే సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 5, 2021 / 05:12 PM IST

“ఒరేయ్ బుజ్జిగా” లాంటి డిజిటల్ ఫ్లాప్ అనంతరం రాజ్ తరుణ్-విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “పవర్ ప్లే”. “లక్ష్మీ రావే మా ఇంటికి” చిత్ర దర్శకుడు నంద్యాల రవి కథ అందించిన ఈ చిత్రంలో పూర్ణ కీలకపాత్ర పోషించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: విజయ్ కుమార్ (రాజ్ తరుణ్) ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతుంటాడు. ఇంకో వారంలో పెళ్లి అనగా దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అవుతాడు విజయ్. దాంతో ప్రేమించిన కీర్తి (హేమల్)కు దూరమవుతాడు. తండ్రి దగ్గర విలువ కోల్పోతాడు. త్వరలో చేరబోయే గవర్నమెంట్ ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోతాడు. జీవితమే నాశనం అయిపోతుంది. అసలు తన జీవితం ఉన్నట్లుండి ఇలా ఎందుకు అయ్యింది అని తెలుసుకోవడం మొదలెట్టిన విజయ్ ను చంపడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అసలు విజయ్ ను దొంగ నోట్ల కేసులో ఇరికించింది ఎవరు? విజయ్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “పవర్ ప్లే”.

నటీనటుల పనితీరు: రాజ్ తరుణ్ అండర్ ప్లే చేద్దామనుకున్నాడో లేక సబ్టల్ గా నటిద్దామనుకున్నాడో తెలియదు కానీ.. సినిమా మొత్తం నీరసంగా కనిపిస్తాడు. ఆఖరికి కాస్త చలాకీగా ఉండాల్సిన సన్నివేశాలోనూ అదే తీరు. నటుడిగా రాజ్ తరుణ్ చేసిన ఈ ప్రయోగం ఫెయిల్ అయ్యింది. ఇంటెన్సిటీ పండాల్సిన సన్నివేశాల్లోనూ అదే తీరు. హీరోయిన్ హేమల్ కి పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. పూర్ణకి మంచి పాత్ర దొరికింది. ఆమె తనకు లభించిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. కోటా శ్రీనివాసరావు, మధునందన్, అజయ్ లు క్యారెక్టర్ కు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: రైటర్ నంద్యాల రవి రాసిన కథకు దర్శకుడు విజయ్ కుమార్ కొండా న్యాయం చేయలేకపోయాడు. కథగా “పవర్ ప్లే” మంచి గ్రిప్పింగ్ స్టోరీ. బోలెడన్ని లేయర్స్, మల్టిపుల్ ట్విస్ట్స్ & టిపికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే.. వాటిని దర్శకుడు విజయ్ కుమార్ సరిగా యుటిలైజ్ చేసుకోలేదు. ఫస్టాఫ్ వరకు బాగానే లాక్కొచ్చాడు కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి చుట్టేశాడు. ఒక థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన లక్షణాలు సెకండాఫ్ లో ఎక్కడా కనిపించవు. ఒక ముఖ్యమంత్రి రేంజ్ మనిషి ఇన్వాల్వ్ అయినప్పుడు సీరియస్ నెస్ అనేది పీక్స్ లో ఉండాలి. కానీ.. కథనం ఏదో గల్లీ గొడవలా సాగుతుంటుంది.

అందువల్ల ఇష్యూ సెన్సిబుల్ అయినప్పటికీ.. ఆడియన్స్ దాన్ని సీరియస్ గా తీసుకోలేరు. ప్రిన్స్-పూర్ణ క్యారెక్టర్స్ ను సరిగా వాడుకోలేదు దర్శకుడు. పాపం పూర్ణ తన బెస్ట్ ఇచ్చినప్పటికీ.. ఆమె క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్ కి, ఆమె క్యారెక్టర్ ఆర్క్ కి సంబంధం లేకపోవడంతో ఆమె శ్రమ వృధా అయ్యిందనే చెప్పాలి. అన్నిటికీ మించి క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం చాలా సిల్లీగా ఉంది. ఎంత తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసినప్పటికీ.. ఆడియన్స్ ను అలరించే రీతిలో అవుట్ పుట్ లేకపోవడం అనేది పెద్ద మైనస్. సురేష్ బొబ్బిలి, ఐ.ఆండ్రూల పనితనం వారి స్థాయిలో లేదు. బహుశా బడ్జెట్ తక్కువ కావడంతో వారి అవుట్ పుట్ అలా వచ్చి ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగోలేదు.

విశ్లేషణ: ఒకేరోజు 11 సినిమాలు విడుదలయ్యాయి. దాంతో సాధారణంగానే ప్రేక్షకుడికి ఎక్కువ ఆప్షన్స్. గతవారం విడుదలైన సినిమాలు కూడా ఇంకా ఆడుతూనే ఉన్నాయి. ఇవి సరిపోవన్నట్లు వచ్చేవారు మరో మూడు మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ పోటీలో కనీస స్థాయి కంటెంట్ లేని “పవర్ ప్లే” లాంటి సినిమాలు ఆడియన్స్ ను అలరించడం, కమర్షియల్ గా సేఫ్ అవ్వడం అనేది కష్టం.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus