‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుని మే లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.
రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. నిన్న విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు టీజర్ విడుదలను త్వరలోనే ప్రకటించనున్నారు నిర్మాతలు.