మహేష్ బాబు మేనల్లుడి కథను కొట్టేసిన రాజ్ తరుణ్
- January 30, 2019 / 12:46 PM ISTByFilmy Focus
“కుమారి 21f” టైమ్ లో మోస్ట్ లక్కీ హీరో అనుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన అనవసరపు కమిట్ మెంట్స్ కారణంగా.. “అంధగాడు, రాజుగాడు, లవర్” చిత్రాల పరాజయంతో డీలా పడ్డ యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ ఇచ్చేందుకు దిల్ రాజ్ రంగం సిద్ధం చేశాడు. టిడిపి లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు హీరోగా ఒక సినిమా చేయాలని దిల్ రాజు అనుకున్నాడు..అయితే ఆ మూవీ వార్తలకే పరిమితమైంది.
ఈ స్కిప్ట్ ను రూపొందించిన కొత్త దర్శకుడు కృష్ణారెడ్డి దానిని కొద్దిగా మార్చి దిల్ రాజుకు వినిపించాడు.. కథలో కొత్తదనం ఉండటంతో వెంటనే ఓకే చెప్పడమే కాకుండా, ఈ మూవీలో హీరోగా రాజ్ తరుణ్ తీసుకోవలసింది కోరినట్లు టాక్. రాజ్ తరుణ్ కు కూడా కథ నచ్చడంతో అతడు ఓకే చెప్పేశాడు.. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













