రవితేజ కోసమే కేరళ వెళ్లిన రాజా ది గ్రేట్ టీమ్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేస్తున్న “రాజ ది గ్రేట్” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా కొన్ని యాక్షన్ సీన్స్‌ని ఒడిషాలోని రాయ్‌గఢ్‌లో చిత్రీకరించారు. కదిలే ట్రైన్‌పై జరిగే ఫైట్ సీన్ అద్భుతంగా వచ్చిందని టాక్. ఆ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా డైరక్టర్ వెల్లడించారు. అంతేకాదు పాట షూటింగ్ కోసం కేరళ వెళ్తున్నట్లు వివరించారు. రవితేజ కోరిక మేరకే కేరళలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది.

అక్కడ షూటింగ్ జరిగితే ఆ చిత్రం విజయం సాధిస్తుందని రవితేజ నమ్మకం. ఆ సెంటిమెంట్ తోనే అక్కడ ఒక పాట ప్లాన్ చేసినట్లు చిత్ర బృందం చెప్పింది. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.  రాశీఖన్నా స్పెషల్‌ సాంగ్‌ చేసిన ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus