Rajamouli: వైరల్ అవుతున్న రాజమౌళి సంచలన వ్యాఖ్యలు!

  • February 20, 2023 / 10:49 AM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు ఆయన సన్నిహితులు ఆయన ఎంతో కష్టపడతారని అందువల్లే ఈ స్థాయిలో సక్సెస్ దక్కిందని చెబుతారు. సినిమా సినిమాకు ఆయన సక్సెస్ రేట్, పాపులారిటీ ఏ రేంజ్ లో పెరుగుతుందో ఆయన పడుతున్న కష్టం అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్క్రిప్ట్ ను చదువుతూ చాలాసార్లు ఏడ్చానని కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది.

తన సినిమాలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న రాజమౌళి త్వరలో నాటు నాటు సాంగ్ కు అవార్డ్ కూడా అందుకోనున్నారని సమాచారం అందుతోంది. ఆస్కార్ కచ్చితంగా ఈ సినిమాకే అస్తుందని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన లేదని అయితే ఆ స్క్రిప్ట్ ఎమోషనల్ స్టోరీ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ చదువుతున్న సమయంలో చాలాసార్లు ఏడ్చానని ఈ స్క్రిప్ట్ లోని డ్రామా నన్ను ఎమోషన్ కు గురి చేసిందని అన్నారు. చరిత్రతో దానికి సంబంధం లేదని రాజమౌళి అన్నారు. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా మహేష్ బాబు సినిమాతో జక్కన్న స్థాయి మరింత పెరుగుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే రిజల్ట్ గురించి సందేహం అవసరం లేదని రికార్డుల గురించి మాత్రమే మాట్లాడుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus