మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబ్ ట్రోటర్ మూవీ ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్ రివీల్ లాంచ్ రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది.అందులో భాగంగా రాజమౌళి.. మహేష్ బాబు గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ.. “నేను ప్రతి సినిమాకి ముందుగానే కథ చెప్పేస్తుంటాను. కానీ కొన్ని సినిమాలకు కథ ముందుగా చెప్పడం కుదరదు. వాటిని బిగ్ స్క్రీన్ పైనే చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. అలాంటి సినిమాల్లో ఇదొకటి.
దాదాపు ఏడాది నుండి ఈ సినిమా వరల్డ్ కోసం కష్టపడుతున్నాం. మా ఏడాది కష్టాన్ని ఒకడు డ్రోన్ తో షూట్ చేసి కస్టమ్ నెట్లో పెట్టేశాడు. ఇప్పుడు మీ అందరికీ చూపించడానికి రెడీ అయ్యాం. అయితే దానికంటే ముందుగా నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను చిన్నప్పటి నుండి రామారావు గారి అభిమానిని. ఆయన సినిమాలే చూస్తూ పెరిగాను. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణ గారి గొప్పతనం తెలుసుకున్నాం. టాలీవుడ్ కి కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ఆయన ఎంతో సాహసించరు కష్టపడ్డారు.
సినిమా స్కోప్, కలర్ స్కోప్, 70 ఎం ఎం.. ఇలా ప్రతి టెక్నాలజీని ఆయన టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఆలాంటి గొప్ప వ్యక్తి తనయుడు మహేష్ బాబుతో పని చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాని(వారణాసి) ఐమాక్స్ కోసం తీస్తున్నాం. ఆ టెక్నాలజీని తీసుకొస్తున్నాం. మహేష్ బాబు నుండి మనమందరం నేర్చుకోవాల్సిన గుణం ఒకటి ఉంది. అతను సినిమాలకి రివ్యూలు పెడుతుంటాడు.. కాబట్టి ఎంతసేపు ఫోన్ తోనే గడుపుతాడేమో అని అంతా అనుకుంటాం. కానీ అతను సెట్ కి వచ్చాడు అంటే.. ఫోన్ పెట్టుకోడు.
ప్యాకప్ చెప్పి కార్ ఎక్కే వరకు ఫోన్ పెట్టుకోడు. అలాంటి గొప్ప గుణాన్ని నాతో పాటు మీరంతా కూడా నేర్చుకోవాలి. నన్ను, మహేష్ ని కలిపినందుకు నిర్మాత కే.ఎల్.నారాయణ గారికి పెద్ద థాంక్స్. నేను దేవుడిని పెద్దగా నమ్మను. కానీ రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాలో మహేష్ బాబుని రాముడిగా చూపించబోతున్నాను. లుక్ టెస్ట్ చేసినప్పుడు నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. అతని కొంటెతనం చూసి కృష్ణుడిగా బాగుంటాడని అంతా అనుకుంటారు. కానీ రాముడిగా బాగా సెట్ అయ్యాడు. అతను పరాక్రమశాలి.. అలాగే చాలా గొప్ప గుణాలు కలిగి ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు.