అర్జున్ రెడ్డిపై రాజమౌళి ప్రశంసల వర్షం
- August 29, 2017 / 11:57 AM ISTByFilmy Focus
యువత మెచ్చిన చిత్రం “అర్జున్ రెడ్డి”పై యువ హీరోహీరోయిన్లు బాగానే స్పందించారు కానీ.. కాస్త భారీ క్రేజ్ ఉన్న కథానాయకులు లేదా దర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. ఈ సినిమా కొంతమందిని మాత్రమే అలరించగలుగుతుంది తప్పితే.. అందర్నీ ఆకట్టుకోవడం కష్టమని కొందరు డిసైడ్ అయిపోయారు. అయితే.. అలా ఆలోచించిన వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇప్పుడిప్పుడే ఒక్కొరిగా “అర్జున్ రెడ్డి” సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి నేడు “అర్జున్ రెడ్డి” సినిమా గురించి స్పందించారు.
“ఇప్పుడే అర్జున్ రెడ్డి చూశాను, నిజానికి నాకు “లవ్ స్టోరీస్” నాకు పెద్దగా ఎక్కవు, కానీ ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. విజయ్ దేవరకొండ అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు, “అర్జున్ రెడ్డి” పాత్రలో అతను జీవించేశాడు. అతను మాత్రమే కాదు కథానాయకి షాలిని మరియు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ఆర్టిస్ట్స్ అందరూ చాలా సహజంగా కనిపించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ మొదలుకొని టీం మొత్తాన్ని సరిగ్గా లీడ్ చేసిన డైరెక్టర్ కే సక్సెస్ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు కాంగ్రాట్స్” అంటూ ట్విట్టర్ లో “అర్జున్ రెడ్డి” సినిమా గురించి రాజమౌళి చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సెన్సేషన్. అసలే దూసుకుపోతున్న “అర్జున్ రెడ్డి”కి రాజమౌళి ట్వీట్స్ ఇంకొంత బూస్ట్ ఇవ్వడం ఖాయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















