జక్కన్న చూపు…ఆ ‘హీరో’ వైపు!!!

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడైన గోపీచంద్. మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అదే క్రమంలో ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్స్ లో నటించి మంచి రైసింగ్ ఉన్న గోపించంద్ ఆతరువాత వరుస పరాజయాలతో, సరైన కధలను ఎంచుకోవడంలో వెనుకబడి కాస్త ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వస్తున్న గోపించంద్ కు సరైన స్టోరీ పడాలే కానీ సూపర్ హిట్ తో దూసుకుపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు….

ఇక అదే క్రమంలో య‌జ్ఞం తరహా చిత్రంలో గోపిచంద్ ని యాక్షన్ లో చూడాలని ప్రేక్షకులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. మరి ఈ కోరిక తీరుతుందా అని మీరు ఆలోచిస్తే మాత్రం…..తీరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి…ఎలా అంటే….ఈ కధ చావలాల్సిందే….టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం…రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో ఇక నుండి కొన్ని చిత్రాలు రాబోతున్నాయని అంటున్నారు. బాహుబలి సీక్వెల్ తరువాత దీనికి సంబంధించిన పనులను రాజమౌళి స్టార్ట్ చేయనున్నారు. రాజమౌళి నుండి వస్తున్న కథలకు, తను దర్శకత్వ పర్యవేక్షణగా ఉంటూ..

వారి శిష్యులచేత వరుస మూవీలు తీసుకురావాలని చూస్తున్నారంట. ఇక పనిలో భాగంగా…త్వరలోనే గోపిచంద్ తోనూ ఓ కథని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో మాటలు వినపిస్తున్నాయి. మరి ఒకరేమో మాస్ హీరో, మరొకరు సూపర్ హిట్ డైరెక్టర్ ఇద్దరినీ కలగలిపితే పక్కా యాక్షన్…మాస్ మసాలా ఖాయంగా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus