ఆలోచించి మాట్లాడమంటున్న రాజమౌళి ఫ్యాన్స్!
- July 19, 2017 / 07:59 AM ISTByFilmy Focus
రాజమౌళి…ఈ ఒక్క పేరు చాలు..ఆయన వేసే స్టాంప్ చాలు..ఎలాంటి ఆర్టిస్ట్ అయినా హీరోగా మారిపోయి…టాప్ హీరోగా చాలామణీ అయిపోవచ్చు…అయితే అలాంటి రాజమౌళి తాజాగా తీసిన బాహుబలి సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే…అసలైతే ఈ సినిమా ఒక 1000కోట్ల నుంచి 1200కోట్ల వరకు వసూళ్లు రాబడుతుంది అని అందరూ అనుకున్నారు కానీ…అంతకు మించి…దాదాపుగా 2000కోట్ల వరకూ ఈ సినిమా వసూళ్లు సాధించడంతో జక్కన్న క్రేజ్ మామూలుగా లేదు అన్న సంగతి అర్ధం అవుతుంది. ఇక జక్కన్న క్రేజ్ ఎలా ఉంది అంటే…ఆయన ఏదైనా ఒక సినిమా గురించి ఒక మాట చెప్పాడు అంటే అది కోట్లువిలువ చేసే పబ్లిసిటీ స్ట్రాటజీగా మారిపోతుంది…అదే క్రమంలో ఆయన ఫేస్ బుక్ ట్విట్టర్ ఎకౌంటును ఫాలో అయ్యేవారి సంఖ్య దాదాపు 8.5 మిలియన్స్ ఫాలోయర్స్ వరకూ ఉంది అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు…అలాంటి జక్కన్న చేస్తున్న చిన్న తప్పు వల్ల అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.
అసలు ఏమయింది ఎందుకు ఈ విమర్శలు అంటే… ఒకసారి ఈ మ్యాటర్ చదవండి..రాజమౌళికి వారాహి బ్యానర్ కొర్రపాటి సాయి కు మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే… ఇక ఈ సాన్నిహిత్యంతో రాజమౌళి వారాహి బ్యానర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి ఆసంస్థ తీసే ప్రతీ సినిమాను అద్భుతం అంటూ ప్రమోట్ చేసేస్తాడు కూడా…ఇక ఇదే పద్ధతిలో రాజమౌళి గతవారం విడుదల అయిన జగపతిబాబు ‘పటేల్ సర్’ ను కూడ విడుదల కాకుండానే అద్భుతం అంటూ ప్రమోట్ చేసాడు. అయితే ఆ మూవీ ఆయన చెప్పినంత బాగా లేదు అన్న టాక్ బయటకు రావడంతో…రాజమౌళి మాటలు నమ్మి ఆసినిమాకు వెళ్ళిన అయన అభిమానులు కొందరు రాజమౌళి ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం ఏమిటి అని కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. అదే మరీ అసలు మ్యాటర్…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















