Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి ఇష్టమైన సినిమాలు ఇవే!

  • June 7, 2022 / 05:38 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాలను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో కథ, కథనం అద్భుతంగా ఉంటాయని జక్కన్న ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తాడని ఫ్యాన్స్ భావిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ పొందడం ద్వారా జక్కన్న వార్తల్లో నిలుస్తున్నారు. ఈగతో సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన ఘనత రాజమౌళి సొంతమని చెప్పవచ్చు. అయితే రాజమౌళి ఫేవరెట్ మూవీ ఏదనే ప్రశ్నకు వేర్వేరు జవాబులు ప్రచారంలో ఉన్నాయి.

2004లో ఒక సందర్భంలో జక్కన్న తన ఫేవరెట్ మూవీ ఏదనే ప్రశ్నకు మాయాబజార్ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో తన ఫేవరెట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అని సూర్యకాంతం అంటే కూడా తనకు చాలా అభిమానమని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు సినిమాలతో పాటు రాజమౌళి హాలీవుడ్ సినిమాలకు కూడా ఇష్టపడతారు. రాజమౌళి ఒక సందర్భంలో హాలీవుడ్ మూవీ “బ్రేవ్ హార్ట్” ను 100 కంటే ఎక్కువసార్లు చూశానని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీ స్క్రిప్ట్ పనులతో బిజీ అయ్యారు. తన గత సినిమాలను మించి ఈ సినిమా ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ విడుదలైన తర్వాత మహేష్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. రాజమౌళి 2025లో ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల సమయం పడుతుందని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయ్యారు. రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాలకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండటం ఆయనకు ఒకింత ప్లస్ అవుతోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus