Rajamouli: సుకుమార్ సినిమాలోని ఆ సన్నివేశం చూసి జక్కన్న అలా ఫీల్ అయ్యారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తన సినిమాలు ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నంగా, ప్రత్యేకంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి సినిమాలలో కథ, కథనం కొత్తగా ఉంటాయనే సంగతి తెలిసిందే. జక్కన్న తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జగడం సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూసి రాజమౌళి కుళ్లుకున్నారట.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాజమౌళి మాత్రం తనకు అలాంటి ఐడియా ఎందుకు తట్టలేదని ఫీలయ్యారట. జగడం సినిమాలోని ఒక సన్నివేశంలో హీరో పాత్ర గ్యాంగ్ లో వెనుక ఉండగా అవతలి వైపు ఉన్న గ్యాంగ్ ను చూసి రామ్ పాత్ర గ్యాంగ్ భయపడి వెనక్కి వెళుతుంది. రామ్ పాత్ర మాత్రం వెనుకడుగు వేయకుండా ఎదురించి అవతలి గ్యాంగ్ ను భయపెడతాడు. జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఈ సీన్ మరీ అద్భుతమైన సీన్ అని అనిపించడం లేదని చెబుతారు.

జక్కన్న మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి. హాలీవుడ్ లెవెల్ లో యాక్షన్ సీన్లతో మహేష్ రాజమౌళి కాంబో మూవీని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. మహేశ్ జక్కన్న కాంబో మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత కాగా మరి కొందరు నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం తీసుకోకున్నారని తెలుస్తోంది.

జక్కన్న (Rajamouli) పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని హాలీవుడ్ స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న సక్సెస్ ను చూసి ఆయన కంటే గొప్పగా సినిమాలను తీయాలని చాలామంది దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా అంతకు మించిన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus