ఎన్టీఆర్ అభిమానులని ఖుషీ చేసిన రాజమౌళి..!

‘బాహుబలి’ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.చిత్రం’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం.. 2020 జూలై 30 విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉండగా.. రాజమౌళి డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెంబర్ 1’ లో కూడా ఎన్టీఆరే హీరో అన్న సంగతి తెలిసిందే.

ఇక ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ… అప్పటి ఫోటోని అలాగే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. “18 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘స్టూడెంట్ నెం 1′ చిత్రం విడుదల కావడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ లావుగా ఉన్నాడు… నేను సన్నగా ఉన్నాను. ఇన్నేళ్ళ తర్వాత నేను కాస్త లావయ్యాను.. ఎన్టీఆర్ సన్నబడ్డాడు.. ఈ రెండు దృశ్యాలు రామోజీ ఫిలిం సిటీలోనివే కావడం విశేషం’ అంటూ రాజమౌళి తెలిపాడు. రాజమౌళి షేర్ చేసిన ఈ ఫోటోలు ఎన్టీఆర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి…!

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus