Rajamouli: జక్కన్న కామెంట్లతో సంతోషంలో తారక్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ స్పెషల్ కాంబినేషన్ అని సినీ అభిమానులు భావిస్తారు. రాజమౌళి డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలలో నటించిన హీరో ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 (Student No: 1) సినిమాతో ఇండస్ట్రీలో అటు రాజమౌళి ఇటు ఎన్టీఆర్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అని రాజమౌళి పలు సందర్భాల్లో వెల్లడించడం గమనార్హం. తాజాగా సత్యదేవ్ (Satyadev) నటించిన కృష్ణమ్మ (Krishnamma) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో అనుబంధం గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని యాంకర్ ప్రశ్నించగా ఆడియన్స్ అంతా జూనియర్ ఎన్టీఆర్ అంటూ గట్టిగా నినాదాలు చేయడం జరిగింది. రాజమౌళి ఆ కామెంట్లకు స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదని నాకు తమ్ముడితో సమానం అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారని బాహుబలి (Baahubali) నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) , ఈగ నిర్మాత సాయి కొర్రపాటి (Sai Korrapati) మంచి స్నేహితులు అని ఆయన కామెంట్లు చేశారు.

నా ఫస్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ 1 రావడానికి రైటర్ పృథ్వీతేజ కారణం అని రాజమౌళి పేర్కొన్నారు. జక్కన్న ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తారక్ రాజమౌళి మధ్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ పేర్కొన్నారు.

కృష్ణమ్మ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని రాజమౌళి వెల్లడించారు. సత్యదేవ్ కు సరైన సినిమా పడితే ఊహించని స్థాయిలో స్టార్ డమ్ రావడం ఖాయమని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి చేసిన కామెంట్ల గురించి తారక్ సైతం రియాక్ట్ అవుతారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus