‘బాహుబలి’ తరువాత భారతీయ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సినిమాల అమరశిల్పి, జక్కన్న రాజమౌళి చెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా మార్చి నుండి షూటింగ్ నిలిచిపోయ్యింది. అంతకు ముందు వేసిన ప్లాన్స్ చెల్లాచెదురు అయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూళ్ళు వేశారు. ఈ రోజు నుండి హైద్రాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ స్టార్ట్ అయ్యింది. కాని తారక్, చరణ్ జాయిన్ అవ్వలేదట. హీరోలు మినహా మిగతా స్టార్ కాస్ట్ మీద సీన్లు తీస్తున్నారట.
షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ రాజమౌళి కొంత టైమ్ ఇచ్చార్ట. హీరోలు అవసరం లేని సీన్లు ముందుగా షూట్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. హీరోలు ఒకరి తరువాత మరొకరు షూట్ లో జాయిన్ కానున్నారని ఇన్ఫర్మేషన్ అందింది. ఇద్దరిలో ముందుగా ఎన్టీఆర్ లొకేషన్ లో అడుగుపెట్టనున్నారు. తరువాత రామ్ చరణ్ జాయిన్ అవ్వనున్నారు. తండ్రి చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని, ‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో రామ్ చరణ్ జాయిన్ కానున్నారు. ఈలోపు ఎన్టీఆర్ మీద సీన్లు తెరకెక్కించనున్నారు. చరణ్ జాయిన్ అయ్యాక అతడి సీన్లు తీస్తారు. కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుండగా, అతడికి జోడీగా ఫారిన్ యాక్టర్ ఒలీవియా మోరిస్ యాక్ట్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో రామ్ చరణ్, అతడికి జోడిగా సీత క్యారెక్టర్ లో అలియా భట్ యాక్ట్ చేస్తున్నారు.
Most Recommended Video
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!