ఊహించని షాక్ లో ఎన్టీఆర్, రాజమౌళి!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే….గుక్క తిప్పుకోకుండా చెప్పే మాట దర్శకుడు రాజమౌళి. ఇక వీరిద్దరి కాంబినేషన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే…వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి రికార్డుల ప్రభంజనానికి దారి తీసింది. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఒక వార్త హాట్ హాట్ గా ఇండస్ట్రీ లో చక్కెర్లు కొడుతుంది ఎంతకీ…ఆ వార్త ఏంటి అంటే…ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లాంచ్ చేయబోతున్న తమ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై మంచి చిత్రం తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అని ఆలోచిస్తే.. ఎన్టీఆర్, రాజమౌళి అని తెలిసిందట.

అంతే తమ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ప్రస్తుతం …ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో, రాజమౌళి బహుబలి-2లో బిజీగా ఉండడంతో, ఈ రెండు ముగిసిన అనంతరం వారి కాంబోని సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథని అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఓ భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు గల్లా జయదేవ్ పావులు కదుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఎంతవరకూ నిజమో కానీ, ఇది జరిగితే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus