రాజమౌళి సినిమా అంటేనే చెక్కడం, చెక్కడం.. ఏళ్ల తరబడి తీయడం అనే ముద్ర ఉంది. కానీ ‘వారణాసి’ (SSMB29) విషయంలో జక్కన్న రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. బయట సైలెంట్‌గా ఉన్నా, లోపల మాత్రం పని రాకెట్ వేగంతో జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే, రాజమౌళి ఈసారి తగ్గేదేలే అని ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.
VARANASI
అసలు మ్యాటర్ ఏంటంటే.. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ఫిల్మీ సిటీ’ స్టూడియో ఇప్పుడు రాజమౌళి కోటగా మారిపోయింది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్‌లకు చెందిన ఈ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ జక్కన్న తన ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం రెండు, మూడు రోజుల కోసం కాదు.. ఏకంగా వచ్చే ఏడాది జనవరి వరకు ఈ స్టూడియోను బ్లాక్ చేశారట. అంటే అక్కడ జరగబోయేది మామూలు షూటింగ్ కాదన్నమాట.
సాధారణంగా రాజమౌళి వర్క్‌షాప్స్‌కే నెలల సమయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు జనవరి వరకు కంటిన్యూస్ షెడ్యూల్ ప్లాన్ చేశారంటే, సినిమాలోని అత్యంత కీలకమైన ఎపిసోడ్స్‌ను ఇక్కడే ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే వేరే ప్రాంతాల్లో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న టీమ్, ఇప్పుడు ఇక్కడ వేసిన భారీ సెట్స్ మధ్య అసలు సిసలైన యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారు. మహేష్ బాబుతో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఈ స్పీడ్ చూస్తుంటే 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్‌ను రాజమౌళి చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. లుక్ టెస్టులు, ప్రీ-ప్రొడక్షన్ హడావిడి ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు గ్రౌండ్‌లో రియల్ వార్ నడుస్తోంది. గ్లోబల్ ప్రాజెక్ట్ కావడంతో విజువల్స్ పరంగా, సెట్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఆ స్టూడియోలోని అత్యాధునిక సదుపాయాలను పూర్తిగా వాడుకుంటున్నారట.