రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మల్టీ స్టారర్ మూవీ

పౌరాణికం, చారిత్రిక సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇది వరకు చెప్పారు. అయితే అది డైరక్టర్ ఎవరు అనే దాని పై ఆధారపడి ఉంటుందని, రాజమౌళి లాంటి వారు వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేసారు. మల్టీ స్టారర్ మూవీ చేస్తానని చెప్పడమే కాదు .. విక్టరీ వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి చూపించారు. ఈ రెండు విషయాల్లో మహేష్ బాబు క్లారిటీ ఇవ్వడం తో ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు.

ఇందులో ప్రిన్స్ తో బాటు నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా నటించనున్నట్లు సమాచారం. గతంలో మహా నటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రానికి తెలుగు సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సూపర్ హిట్ చేసారు. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత అలనాటి మహా నటుల వారసులు కలిసి నటిస్తే ఇరు వర్గాల అభిమానులకు కనుల పండుగే. బాహుబలి కంక్లూజన్ విడుదల అయిన వెంటనే ఎస్.ఎస్.

రాజమౌళి ఈ చిత్రం పై పని చేయనున్నారు. ఆయనే ఈ కథ పౌరాణికమా, లేకుంటే మహేష్ అభిమానులు కోరుకున్నట్లు జేమ్స్ బాండ్ తరహలో ఉంటుందో వెల్లడించనున్నారు. ఇంతటి భారీ మల్టీ స్టారర్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మించనున్నట్లు వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus