ఒత్తిడికి తలొంచని రాజమౌళి!

ఏప్రిల్ 28, 2017. ఈ రోజు కోసం సినీ అభిమానులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన మరో కళా ఖండాన్ని వెండి తెరపైన వీక్షించడానికి తొందర పడుతున్నారు. కానీ జక్కన్న మాత్రం ఏ విషయం లోను తొందర పడడంలేదు. అసలు రిలీజ్ డేట్ ను కూడా ఆయన గుర్తుపెట్టుకోవడం లేదంట. ఒకే దాని మీద దర్శకధీరుడు దృష్టి పెట్టారని చిత్ర బృందం తెలిపింది. బాహుబలి బిగినింగ్ కంటే బాహుబలి కంక్లూజన్ అన్ని విధాలుగా బాగుండాలి అనే సంకల్పంతోనే రాజమౌళి పనిచేస్తున్నారు. ఆలా చిత్రం తయారవ్వ డానికి ఎన్నిరోజులు పట్టినా పరవాలేదని దర్శక ధీరుడు తన టీమ్ కి రీసెంట్ గా చెప్పినట్లు తెలిసింది. డెడ్ లైన్ అంటూ ఏదీ లేకుండా పని చేయమని చూసించాడంట.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో షూటింగ్ కొనసాగుతోంది. ఈ భీకర పోరాటంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానాలతో పాటు ఐదువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. తర్వాత ఎడిటింగ్, ఎఫెక్ట్స్ జోడించనున్నారు. ఇప్పటికే 400 కోట్ల ప్రీ బిజినెస్ చేసిన ఈ చిత్రాన్ని హడావుడిగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని, ఎప్పుడు విడుదల చేసిన క్రేజ్ తగ్గదని నిర్మాతలకు రాజమౌళి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బాహుబలి కంక్లూజన్ రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus