‘జెర్సీ’ చిత్రం పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి..!

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా నటించాడు. నాని కి గతేడాది రెండు ప్లాపులు రావడంతో.. ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే టీజర్ .. ట్రైలర్ విడుదలయ్యాక ఒక్కసారిగా అందరిలోను ఆసక్తి పెరిగింది. ఇక విడుదలైన తరువాత విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఇప్పటికే ఈ చిత్రం చూసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి దర్శకధీరుడు రాజమౌళి కూడా చేరిపోయాడు. ఈ చిత్రం పై రాజమౌళి స్పందిస్తూ .. ” సినిమా చాలా బాగుంది .. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతంగా తెరకెక్కించాడు. సన్నివేశాలను రాసుకున్న తీరు .. తెరపై వాటిని ఆవిష్కరించిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. నాని.. అర్జున్ పాత్రలో ఇమిడిపోయి ప్రతి సన్నివేశాన్ని పండించిన తీరు చాలా బాగుంది” అంటూ ప్రశంసలు కురిపించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus