Rajamouli: అసలైన బిగ్ స్క్రీన్ OG ఆయనే: రాజమౌళి!

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి(S. S. Rajamouli), శంకర్ (Shankar)  ప్రతిభ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించిన ఈ భారీ చిత్రంపై ఆయన గొప్పగా మాట్లాడారు. ఈ సందర్భంగా స్పెషల్ గెస్టుగా వచ్చిన రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ, శంకర్ గారు పాన్-ఇండియా సినిమాలో బిగ్ స్క్రీన్ కు OG – ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అభివర్ణించారు.

Rajamouli

“నేటి తరం డైరెక్టర్లకు కూడా శంకర్ గారి పని విధానం ఒక స్ఫూర్తి. భారీ బడ్జెట్ సినిమాలకు దారి చూపిన వారు. మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు, ఒక పెద్ద కలను పెద్ద స్క్రీన్ పై చూపించగలిగే ధైర్యం ఆయననుంచే కలిగింది. ఆ విశ్వాసం ఇప్పటికీ పరిశ్రమను ముందుకు నడిపిస్తోంది,” అని రాజమౌళి వివరించారు. ‘ఒకే ఒక్కడు’ వంటి వింటేజ్ శంకర్ గారి సినిమాలు ఇప్పటికీ ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాయని రాజమౌళి చెప్పారు.

“గేమ్ ఛేంజర్ చూస్తే మళ్లీ అలాంటి ఫీలింగ్ కలుగుతోంది. శంకర్ గారి ప్రతిభ ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ లో కనిపించనుంది. ఈ సినిమాతో వింటేజ్ శంకర్ గారి స్థాయి పదింతలు పెరుగుతుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, “మగధీర” (Magadheera) రోజుల నుంచి అతని ఎదుగుదల ప్రశంసనీయమని అన్నారు. “హెలికాప్టర్ షాట్ లో లుంగీతో వచ్చిన చరణ్ ను చూస్తే మాస్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో ఊహించగలం.

అతని నటన, డ్యాన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతీదీ అద్భుతంగా ఉంటాయి,” అని రాజమౌళి ఉత్సాహంగా వివరించారు. ఇక ‘గేమ్ ఛేంజర్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి మాటలతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. “మనం మళ్లీ ఒక అసలైన బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నాం,” అని రాజమౌళి నమ్మకంతో మాట్లాడారు. మరి ఆయన మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

పుష్ప 2 vs ముఫాసా.. అసలు సినిమానే దెబ్బకొట్టాయిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus