ఇండియన్ థియేటర్లలో ప్రస్తుతం రెండు ప్రధాన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2’కు (Pushpa 2: The Rule) ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. మరోవైపు, హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ‘ముఫాసా’ డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గానే కాకుండా, భారతీయ భాషలైన తెలుగు, హిందీ, తమిళ భాషలలోనూ విడుదలైంది.
ఈ యానిమేషన్ చిత్రానికి ప్రత్యేకంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. 13వ రోజుకు ఈ చిత్రం హిందీలో ₹3.93 కోట్ల నెట్ వసూళ్లు సాధించడంతో మంచి ఫలితాలు సాధించింది. అదే సమయంలో, ‘పుష్ప 2’ 28వ రోజుకి కూడా థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సినిమా ఒక రోజులోనే ₹9.6 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, 29.12% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. హిందీ బెల్ట్‌లో ఇది ఒక స్ట్రైట్ హిట్‌గా నిలిచింది.
మొత్తం 6,863 షోల ద్వారా వచ్చిన ఈ కలెక్షన్లు సినిమా పాపులారిటీని స్పష్టంగా చూపిస్తున్నాయి. మరోవైపు, బాలీవుడ్‌లో వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన ‘బేబీ జాన్’ (Baby John) మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. 18వ రోజు ఈ సినిమాకు 3,699 షోలు పడినా, కేవలం ₹2.65 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది. 18.18% థియేటర్ ఆక్యుపెన్సీతో ఆడియన్స్ ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 ముఫాస చిత్రాలు బాలీవుడ్ ప్రేక్షకుల మధ్య మంచి పోటీని సృష్టించాయి.
దీంతో బేబీ జాన్ ను ఈ సినిమాలు గట్టి దెబ్బె కొట్టాయి. ఒరిజినల్ హిందీ సినిమాను కాదని హిందీ ఆడియెన్స్ డబ్బింగ్ సినిమాలపై ఫోకస్ చేస్తుండడం విశేషం. ‘పుష్ప 2’ స్ట్రైట్ హిందీ సినిమా కాకపోయినా, ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతమైంది.
పుష్ప 2: 28వ రోజు | 6,863 షోలు | ₹10.22 కోట్ల గ్రాస్ | ₹9.6 కోట్ల నెట్ | 29.12% ఆక్యుపెన్సీ
ముఫాసా: 13వ రోజు | 2,246 షోలు | ₹3.93 కోట్ల నెట్ | 31.42% ఆక్యుపెన్సీ
బేబీ జాన్: 18వ రోజు | 3,699 షోలు | ₹2.95 కోట్ల గ్రాస్ | ₹2.65 కోట్ల నెట్ | 18.18% ఆక్యుపెన్సీ