పదహారు సంవత్సరాల్లో కేవలం పన్నెండు సినిమాలు మాత్రమే రాజమౌళి తెరకెక్కించారు. ఒక్క అపజయాన్ని కూడా చూడలేదు. తన సినిమా రికార్డును తానే బద్దలు కొట్టడం ఆయన స్పెషల్. ప్రతి సినిమాకాదు.. ప్రతి ప్రేమ్ ని బొమ్మ గీసినట్టు చిత్రీకరిస్తుంటారు. తెలుగువారు గర్వించతగ్గ దర్శకుడిగా ఎదిగినప్పటికీ నిత్య విద్యార్థిలా ఉంటారు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమాలు చూస్తుంటారు. అందులో ఏదో కొత్త విషయం నేర్చుకుంటుంటారు. ఈ ఏడాది రిలీజ్ అయినా తెలుగు సినిమాల్లో అర్జున్ రెడ్డి బాగా నచ్చిందని మీడియాకి చెప్పిన జక్కన్న.. తనని ప్రభావితం చేసిన మూవీ గురించి వెల్లడించారు. హాలీవుడ్ చిత్రం బ్రేవ్ హార్ట్ తనకి బాగా నచ్చిందని వివరించారు.
మెల్ గిబ్సన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ 1995 లో రిలీజ్ అయింది. 5 ఆస్కార్స్ తో పాటు అనేక అవార్డ్స్ అందుకుంది. “బ్రేవ్ హార్ట్ చిత్రాన్ని నేను వంద సార్లు కంటే ఎక్కువగా చూశాను. ఆ చిత్రంలో ప్రతి యాక్షన్, ప్రతి సీన్లో ఉండే ఎమోషన్ అద్వితీయం. ఆ చిత్రం నా ఊహకు అందని విధంగా ఉంటుంది” అని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తీయనున్న మల్టీస్టారర్ మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.