బాహుబలి2 ప్రమోషన్స్ లో భాగంగా, రకరకాల ఛానెల్స్ లో ఇంటెర్వ్యు ఇచ్చిన రాజమౌళి ఒకానొక ఛానెల్ లో దేవుడిపై మీకున్న నమ్మకం గురించి చెప్పమంటే, తాను దేవుణ్ణి నమ్మను అంటూ చెప్పడం ఇప్పుడు అనవసర వివాదాలకు కారణంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఒక్కసారిగా తమిళ మీడియాలో కోట్ చేస్తూ, రాజమౌళి లాంటి టాప్ సెలెబ్రెటీ ఇలా అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు జనానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయి అంటూ ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ప్రస్తావిస్తూ జకన్నపై ఆస్తికులు విరుచుకుపడుతూ ఉన్నారు.అదేమిటి అంటే, ‘ఒక్కొక్కణ్ని కాదు షేర్ ఖాన్, వంద మందిని ఒకే సారి రమ్మను’ అంటూమగధీర మూవీలో రామ్ చరణ్ చెప్పే యుద్ధ సన్నివేశఓ మహాశివుడు విగ్రహం చుట్టూనే జరిగిన విషయం తెలిసిందే. దీనికితోడు ఆ మూవీలో అష్టగ్రహ కూటమి అనే కాన్సెప్ట్ను కుడా వాడుకున్నాడు రాజమౌళి.
‘బాహుబలి’ వన్ లో శివలింగాన్ని ప్రభాస్ భుజాల పై మోసే సీన్ అద్భుతంగా తీశాడు రాజమౌళి. అంతేకాదు శివుడు పేరుతోనే పెరుగుతాడు మహేంద్ర బాహుబలి. అదేవిధంగా అగ్నిప్రస్థం అంటూ ఓ కాన్సెప్ట్ తో అమ్మవారి గుడి దగ్గర రాక్షస దహనం సీన్ ‘బాహుబలి2’ లో ఉన్న విషయం తెలిసిందే. వీటన్నిటిని చూసిన తరువాత రాజమౌళి ఖచ్చితంగా శివభక్తుడు అని అంతా అనుకుంటే తాను నాస్తికుడిని అని చెప్పాడు మన రాజమౌళి. అయితే రాజమౌళి నాస్తికుడు అయితే దేవుళ్లకు సంబంధించిన సన్నివేశాలను అంత అద్భుతంగా ఎలా తీస్తాడు? భారత దేశంలో దేవుడి పై విశ్వాసం సన్నగిల్లడానికి ఇలాంటి ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలే కారణం అంటూ కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు రాజమౌళిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం ఆస్తికత్వాన్ని ఉపయోగించుకుంటూ వారి నిజ జీవిత భావాలను చెప్పడంలో తాము దేవుళ్లను నమ్మము అని చెప్పడం ఒక విధంగా ఆస్తికత్వానికి రాజమౌళి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు మారుతోందని కొందరి వాదన. మొత్తంగా దాదాపుగా 5ఏళ్ల పాటు పడ్డ కష్టాన్ని పక్కన పెట్టేసి ఏదో నోరు జారీ రెండు మాటలు మాట్లాడినందుకు, అదీ తన భావాన్ని తాను తెలిపినందుకు ఎన్ని తిప్పలు వచ్చాయో మన జక్కన్నకు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.