‘ఆర్.ఆర్.ఆర్’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..?

  • July 3, 2020 / 05:40 PM IST

మెగా పవర్ స్టార్ రాం చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు చరణ్. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కూడా కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. గత మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ప్రభుత్వం సినిమా షూటింగుల‌కు పర్మిషన్ ఇచ్చినా..క*నా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్,చరణ్ షూటింగ్ కు రావడానికి ఒప్పుకోవడం లేదట.

దీంతో జక్కన్న కూడా వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2021 దసరాకే విడుదల చెయ్యాలని ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. ‘ఆర్.ఆర్.ఆర్’ వాయిదా పడింది కాబట్టి.. ఇప్పుడు చరణ్.. ‘ఆచార్య’ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడట. ‘ఆచార్య’ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ లో చరణ్ పాత్ర కనిపిస్తుందని తెలుస్తుంది. ఇది సినిమాని మలుపు తిప్పే పాత్రని కూడా సమాచారం.

మొదట ఈ పాత్రకు మహేష్ ను తీసుకున్నట్టు కొన్నాళ్ళు ప్రచారం నడిచింది.తరువాత చరణ్ ఫిక్స్ అయినట్టు ఖరారు చేశారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ డిలే అవ్వడంతో.. ‘ఆచార్య’ లో చరణ్ నటించే ఛాన్స్ లేదని.. ఈ పాత్రకోసం పవన్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ను మరింత కాలం వాయిదా వేసి రాజమౌళి.. చరణ్ కు లైన్ క్లియర్ చేసాడనే చెప్పాలి.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus