Rajamouli, Ram Charan: చరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న!

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదం కూడా చోటుచేసుకుంది. రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చరణ్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజమౌళి (Rajamouli) ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్‌ పాత్రని సైడ్‌ రోల్‌ అనేది చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆ పాత్రల గురించి రాజమౌళి మాట్లాడారు. ఎన్టీఆర్‌కి పాజిటివ్ గా ఆయన వ్యాఖ్యలున్నాయి. ఈ సినిమాలో కనుక కొమరం భీముడు అనే పాటతోనే సినిమాని కనుక పూర్తి చేసి ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం సైడ్ క్యారెక్టర్ అయ్యదని ఆయనది ప్రధాన పాత్ర అయ్యేది కాదు అంటూ కామెంట్ చేశారు.

దీంతో చరణ్ అభిమానులు ఒక్కసారిగా తమ హీరో గురించి జక్కన్న ఏంటి ఇలా మాట్లాడేశారు అంటూ ఆశ్చర్యంలో ఉండగా ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఖుషి ఫీలవుతున్నారు. వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రామ్‌చరణ్‌ ది సైడ్ రోల్‌ అనే వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రామ్ చరణ్ ది సైడ్ రోల్ అయితే ఎన్టీఆర్ ది హీరో పాత్ర కథ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో క్లిప్ మరింత వైరల్ చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus