Jr NTR, Rajamouli: ఎన్టీఆర్ అభిమానులకు భారీ షాకిచ్చిన జక్కన్న!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో మూడు నెలల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేస్తే వేసవి సెలవులు కలిసొస్తాయని సినిమాను అప్పుడే విడుదల చేయాలని అభిమానులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత కరోనా కేసులు తగ్గే ఛాన్స్ అయితే ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రామరాజు పాత్రలో తారక్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

వ్యక్తిగతంగా చరణ్ కంటే తారక్ ను ఎక్కువగా ఇష్టపడే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం రామరాజు పాత్రే ఎక్కువగా ఇష్టమని తాజాగా చెప్పారు. సినిమాలో అటు రామ్ చరణ్ పాత్రకు ఇటు ఎన్టీఆర్ పాత్రకు సమ ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాజమౌళి ఈ విధంగా కామెంట్లు చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు. తారక్ మూడున్నరేళ్లుగా ఆర్ఆర్ఆర్ సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో జక్కన్న కామెంట్లు వైరల్ అవుతుండగా రాజమౌళి కామెంట్లపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తారక్ కొరటాల శివ కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేశారని సమాచారం. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

జనతా గ్యారేజ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తో పాటు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జై లవకుశ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus