RRR Glimpse: ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్ వాళ్ళకి వణుకు పుట్టిస్తోందట..!

‘బాహుబలి ది బిగినింగ్’ జర్నీ డివైడ్ టాక్ తోనే మొదలైంది. ‘భారీ బడ్జెట్ చిత్రాలను మన తెలుగు మేకర్స్ హ్యాండిల్ చేయలేరు’ ‘ఐ చిత్రంతో శంకరే ఏమీ చేయలేకపోయాడు’ అంటూ ఇక్కడి క్రిటిక్స్ మొదట ఏకి పారేసారు. అయితే బాలీవుడ్లో మాత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ‘బాహుబలి ది బిగినింగ్’. ఒక్కరోజులోనే బాలీవుడ్ జనాలు ‘వై కట్టప్ప కిల్లుడ్ బాహుబలి’ అంటూ దేశం మొత్తం మార్మోగేలా చేశారు. అక్కడ ఓ టాలీవుడ్ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం అదే మొదటిసారి.

దాంతో ‘బాహుబలి2’ ని జాగ్రత్తగా చెక్కి.. టాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ లెవెల్లో చాటి చెప్పాడు మన జక్కన్న. ‘బాహుబలి2′ అక్కడ మొదటి షోతోనే దండయాత్ర మొదలుపెట్టింది. నిజానికి ఆ సినిమాలో బాలీవుడ్ నటీనటులు ఉండరు. అయినా వాళ్ళకి నచ్చేలా తీర్చిదిద్ది ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసాడు జక్కన్న. ఇంకో విషయం ఏంటంటే.. బాలీవుడ్ జనాలకి టాలీవుడ్ అన్నా, ఇక్కడి ప్రేక్షకులన్నా బాగా చిన్న చూపు.’బాహుబలి1’ హిట్ అయినప్పుడు కూడా దానిని సౌత్ సినిమా అన్నారే తప్ప టాలీవుడ్ సినిమా అని వాళ్ళు ఒప్పుకోలేదు.

అయితే ‘బాహుబలి2’ వాళ్ళందరి నోళ్ళు మూయించింది. ఇక ఈరోజు విడుదల చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్ అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. జనవరిలో అక్కడ పెద్ద సినిమాలను విడుదల చేయాలని అక్కడి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ గ్లిమ్ప్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి వారు మనసు మార్చుకున్నారనేది తాజా సమాచారం. దీనిని బట్టి.. ఈ చిన్న గ్లిమ్ప్స్ కే వారెంత భయపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus