Rajamouli: శ్రీ సింహా సినిమా విషయంలో రాజమౌళి ఇన్వాల్వ్మెంట్!

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. ఆ తరువాత ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. ఒకే లొకేషన్ లో చిత్రీకరించిన ప్రయోగాత్మక సినిమా.

సురేష్ బాబు, సునీత తాటి కలిసి నిర్మించారు. సెప్టెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్ గా ఈ సినిమాను తన ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి చూపించారు శ్రీ సింహ. రాజమౌళి ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారట. అలానే కొన్ని సూచనలు, మార్పులు చెప్పారట. ఈ విషయాన్ని శ్రీ సింహా స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా గురించి మొదట్లో తన కుటుంబానికి చెప్పలేదని.. సినిమా పూర్తయిన తరువాత ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశామని అన్నారు.

ఈ సినిమా చూసిన రాజమౌళి గారు ఆనందం వ్యక్తం చేశారని.. చిన్న చిన్న మార్పులు కూడా సూచించారని అన్నారు. ఆ మార్పులు చేసిన తరువాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పుకొచ్చారు శ్రీ సింహా. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వస్తుంటాయని.. ఈ జోనర్ ని తెలుగులో ఎవరో ఒకరు మొదలుపెట్టాలని.. మేం స్టార్ట్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నారు. ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.

ఈ సినిమాతో సతీష్ త్రిపుర అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ సినిమాలో తమిళనటుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. యశ్వంత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus