నిరుత్సాహంలో రాజమౌళి!!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి కాస్త నిరుత్సాహంలో ఉన్నారా? ఏదో తెలియని ఆలోచనలో తన బాహుబలి-2 షూటింగ్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఏదో తెలియని బాధలో ఉన్నారా? అంటే అవును అనే అంటున్నాయి సినిమా వర్గాలు. వివరాల్లోకి వెళితే…బాహుబలి పార్ట్1 ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో బహుబలి-2ని తెరకెక్కిస్తున్నాడు మన జక్కన్న. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది.

అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం ఊపందుకున్నాయి. ఇప్పటికే బాహుబలి2 మూవీకి సంబంధించిన ప్రధాన సీక్వెన్స్ లకి సిజి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ని ఫర్స్ట్ పార్ట్ కన్నా ఎక్కువ లెవెల్ లో విడుదల చెయ్యాలి అని దర్శకుడు ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఈ సినిమాపై మరింత ఫోకస్ పెట్టాడు మన జక్కన్న. అయితే బాహుబలి తొలి పార్ట్ ఇంటర్‌న్యాషనల్ లెవెల్ లో ఫోకస్ కావడానికి, భారీ హిట్ సాధించే క్రమంలో బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ పాత్ర చాలా కీలకం. అదే క్రమంలో ఈ సినిమా పార్ట్2లో కూడా ఆ ప్రొడక్షన్స్ చాలా కష్ట పడుతుంది. ఇంతవరకూ బాగానే ఉంది అసలు చిక్కు అల్లా అక్కడే వచ్చింది.

బాహుబలి2 మూవీ మార్కెట్ కచ్ఛితంగా 1000 కోట్ల రూపాయలను కొల్లగొడుతుందనేది ఇండస్ట్రీ టాక్. ఇక్కడ బాహుబలి2 కోసం ఖర్చు పెట్టేది 180 కోట్ల రూపాయలు. దీనిని టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తే వచ్చే మార్కెట్ 700 కోట్ల రూపాయలు అనేది కరణ్ జోహార్ లెక్క. అయితే బాహుబలి2 కి ఇంటర్నేషనల్ మార్కెట్ ని తీసుకురావాలంటే కరణ్ జోహార్ అందుకు భారీగా డిమాండ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ కి బాలీవుడ్ మార్కెట్ తో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్ రైట్స్ ని ఇస్తే బాహుబలి2 నిర్మాతకి 50 కోట్ల రూపాయల తేడా వస్తుంది. పోనీ….కరణ్ జోహార్ ని కాదని ఇతర సంస్థలకి ఇస్తే… బాహుబలి2 మూవీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల ఆలోచన. అందుకే ఏం చెయ్యాలో అర్ధం కానీ జక్కన్న నిరుత్సాహంలో ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus