ఆర్.ఆర్.ఆర్ గురించి అన్నీ ఆప్డేట్స్ ఆరోజే అంటున్న రాజమౌళి

“బాహుబలి” అనంతరం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్.ఆర్.ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ల గురించి, సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గురించి.. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల పాత్రల గురించి రకరకాల కథనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. రాజమౌళి ఏ ఒక్కదానికి స్పందించలేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. దాంతో అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.

అయితే.. “ఆర్.ఆర్.ఆర్” సినిమా గురించిన అన్నీ అప్డేట్స్ ను ఒకేసారి రివీల్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు జక్కన్న. మార్చి 14న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా సాక్షిగా తన సినిమా గురించిన అన్నీ అప్డేట్స్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నాడు. ఇది రాజమౌళికి కొత్తేమీ కాదు. “మగధీర” నుంచి ప్రతి సినిమాకి ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాను తీయబోతున్న సినిమా జోనర్ ఏమిటి, పాత్రధారుల క్యారెక్టరైజేషన్స్ ఏమిటనేది అందరికీ చెప్తాడు రాజమౌళి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు. సో ఒక రెండ్రోజులు ఆగితే.. ఆర్.ఆర్.ఆర్ గురించి పూర్తి అప్డేట్స్ మనకి వచ్చేస్తాయన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus