దర్శకధీరుడు సృష్టించిన ఆయుధాలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్స్ తప్పనిసరి. అటువంటి సన్నివేశాలు అన్ని చిత్రాల్లో ఉన్నా.. వాటిలో ఉండని ఆయుధాలు జక్కన్న సినిమాల్లో ఉంటాయి. ఇదివరకు ఏ మూవీలో ఉపయోగించని వెపన్స్ ని సృష్టించడంలో రాజమౌళి దిట్ట. అతను తెరకెక్కించిన వెండి తెర కళాఖండం చూసి బయటికి వచ్చిన తరవాత హీరో, హీరోయిన్, పాటలు, ఫైట్లతో పాటు ఫైట్లో హీరో ఉపయోగించిన ఆయుధం గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. అంత ప్రత్యేకత సాధించుకున్న దర్శకధీరుడి వెపన్స్ పై ఫోకస్…

సింహాద్రి గొడ్డలిసరికొత్త ఆయుధాలను పరిచయం చేయడాన్ని రాజమౌళి తన రెండో చిత్రం నుంచే మొదలు పెట్టారు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ఆవేశంతో విలన్లను వేటాడే గొడ్డలి రూపం ఇంటికి వెళ్లినా వెంటాడుతూనే ఉంటుంది. సినిమాలో కీలకసమయంలో తారక్ ఆ గొడ్డలి పట్టుకోవడంతో దానిని ఎవరూ మరిచి పోలేక పోతున్నారు. అది అంతగా గుర్తుండి పోవడానికి మరో కారణం గొడ్డలి డిజైన్. రెండు వైపులా పదునుతో ఆకర్షించింది.

ఛత్రపతి నాగలి గొడ్డలియంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ని పెంచిన చిత్రం ఛత్రపతి. ఇందులో ఇంటరెవెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ లో డార్లింగ్ పట్టుకునే ఆయుధం సరికొత్తగా ఉంటుంది. నాగలిని మినిమైజ్ చేసినట్లు చిన్న నాగలి గొడ్డలి రూపులో ఆకట్టుకుంది. దానిని ప్రభాస్ పట్టుకునేసరికి ఆ వెపన్ అందరిలో ముద్ర పడిపోయింది.

విక్రమార్కుడి వెపన్మాస్ మహారాజ్ రవితేజతో యాక్షన్ ని, కామెడీని కలబోసి రాజమౌళి రూపొందించిన చిత్రం విక్రమార్కుడు. ఇందులో విక్రమ్ రాథోడ్ ఒక ఫైట్లో వాడే ఆయుధం వింతగా ఉంటుంది. సైకిల్ చైన్ రోల్ కావడానికి ఉండే వీల్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఆ పళ్లు చాలా పదునుగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి ఓ రాడ్. ఇటువంటి ఒక ఆయుధాన్ని సృష్టించవచ్చనే జక్కన్న థాట్ కి సెల్యూట్.

మగధీరుడి కత్తివందల ఏళ్ల వెనక్కి పోతే ఆనాటి యుద్ధ వీరుల కత్తులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి ఉన్న బరువు, వాటి పదును, చేసిన తీరు కంటిని మూతపడనీయవు. అప్పటి ఆయుధాలను మగధీర చిత్రం ద్వారా మనకు చూపించారు జక్కన్న. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఉపయోగించిన కత్తి చిత్రంలో వందమందిని నరికితే.. బయట అందరి మనస్సులో నాటుకుపోయింది.

ఈగ సూదిసూది ఆయుధం అని చెబితే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఈగ హీరో అని చెప్పినా నమ్మరు. కానీ ఆ రెండింటిని నిజం చేసి చూపించారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఈగ చిత్రంలో ఈగ విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సూదిని ఉపయోగించి దానికి వెపన్ హోదాను తీసుకొచ్చింది.

బాహుబలి : బిగినింగ్దర్శకధీరుడికి టాలీవుడ్ లో ఆయుధాల సృష్టికర్తగా పేరును ఫిక్స్ చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా కోసం ఇరవై వేల ఆయుధాలను రూపొందించారు. వాటిలో హీరో కత్తి, చిన్న గొడ్డలితో పాటు, విలన్ అయస్కాంతపు చైన్, కాలకేయ త్రిసూళం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus