టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య దర్శకునిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ డైరెక్టర్ చిరంజీవి, బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కథతో రాజశేఖర్ తో సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. తమిళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన మరులమర్చి సినిమాను చూసి ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే హిట్ రిజల్ట్ ను అందుకుంటుందని ముత్యాల సుబ్బయ్య భావించారు. నిర్మాత మేడికొండ మురళీ కృష్ణ మరులమర్చి తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేయగా మొదట ముత్యాల సుబ్బయ్య చిరంజీవికి ఆ సినిమా సీడీని పంపించారు.
నెల రోజుల తర్వాత సీడీ వెనక్కు వచ్చినా చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య బాలకృష్ణకు సీడీ ఇవ్వగా అక్కడినుంచి కూడా సీడీ వెనక్కు వచ్చింది. మరుల మర్చి కథ ప్రకారం సినిమాలో ఊరిపెద్దను మరో గ్రామంలోని వ్యక్తి కొడతాడు. ఊరిపెద్దను కొట్టే పాయింట్ చిరంజీవి, బాలకృష్ణలకు నచ్చకపోవడం వల్లే సూర్యుడు సినిమాను వాళ్లు రిజెక్ట్ చేశారని ముత్యాల సుబ్బయ్య భావించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య రాజశేఖర్ కు కథ చెప్పి ఒప్పించి హిట్ సాధించారు.
రీమేక్ సినిమాలను ఆలస్యంగా తీస్తే సీన్లు కొట్టేస్తారని భావించి రాజశేఖర్ తో వెంటనే సినిమా తీయాలని ముత్యాల సుబ్బయ్య ఫిక్స్ అయ్యారు. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం జరగగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నటిగా సౌందర్యకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.