రాజశేఖర్ ఆగిపోయిన సినిమాకి “గరుడ వేగ” ఎఫెక్ట్!

  • November 7, 2017 / 02:30 PM IST

ఇప్పుడంటే “గరుడ వేగ” సూపర్ హిట్ అయ్యింది కాబట్టి అందరూ రాజశేఖర్ గురించి మాటాడుకొంటున్నారు కానీ.. ఒక రెండు నెలల క్రితం అసలు రాజశేఖర్ ను పట్టించుకొనే నాధుడే లేడు. “గరుడవేగ” కంటే ముందు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ “పట్ట పగలు” అనే సినిమాలో నటించాడు. స్వాతి దీక్షిత్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా చాలా డిఫరెంట్ గా రూపొందింది. సాధారణంగా హారర్ సినిమాలంటే.. ఎక్కువగా చీకట్లోనో లేక డిమ్ లైట్ లోనో ఉంటుంది. కానీ.. మొదటిసారిగా పట్టపగలు, పూర్తి స్థాయి వెలుతురులో ప్రేక్షకుల్ని భయపెట్టాలనుకొన్నాడు ఆర్జీవీ. అందుకే సినిమాకి “పట్టపగలు” అనే టైటిల్ పెట్టాడు.

ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిన ఈ చిత్రం కారణాంతరాల వలన ఆర్జీవి చాలా సినిమాల్లా విడుదలకు నోచుకోలేకపోయింది. అప్పటికి రాజశేఖర్ కు సరైన మార్కెట్ లేకపోవడం, సినిమా ట్రైలర్ కు కూడా ఊహించిన స్థాయి రెస్పాన్స్ రాకపోవడం.. ముఖ్యంగా వర్మ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేయడంతో.. ఆ సినిమాను అందరూ మర్చిపోయారు. అయితే.. ఇన్నాళ్ల తర్వాత రాజశేఖర్ “గరుడవేగ”తో సూపర్ హిట్ కొట్టడం.. వర్మ కూడా నాగార్జునతో ఒక సినిమా తీసేందుకు సన్నద్ధమవుతుండడంతో “పట్టపగలు” చిత్రాన్ని అర్జెంట్ గా ల్యాబ్ నుంచి బయటకు తీసుకురాడానికి సన్నద్ధమవుతున్నారట కొందరు నిర్మాతలు. మరి రాజశేఖర్ జాతకం బాగుండి “పట్టపగలు” కనీస స్థాయి విజయం సాధించినా ఆయన వెంట నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus