యాంగ్రీ యంగ్ మేన్ సరసన కమల్ హీరోయిన్!

అయిదుపదుల వయసు పైబడినప్పటికీ “యాంగ్రీ యంగ్ మేన్” అనే పిలిపించుకోవడానికి ఇష్టపడే రాజశేఖర్ మరోమారు పవర్ ఫుల్ పోలీస్ గా అలరించేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. “గుంటూర్ టాకీస్” ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది. అయితే.. ఈ చిత్రంలో కథానాయికగా కమల్ హాసన్ సరసన “విశ్వరూపం, ఉత్తమ విలన్” చిత్రాల్లో నటించిన పూజా కూమార్ ను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.

కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే కాక కథలోనూ కీలకపాత్ర పోషిస్తుందట పూజా కుమార్ పాత్ర. అలాగే.. ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు అందుకే నటీనటులను తెలుగు-తమిళ భాషల్లో కాస్త గుర్తింపు ఉన్నవారినే సెలక్ట్ చేసుకొంటున్నారట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus