”మా ఇంట్లో అధికారం బయటవాళ్లకెలా ఇస్తా..”: రాజీవ్ కనకాల

అక్టోబర్ 10న జగనున్న ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు మంచు విష్ణుకే అని చెప్పారు నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల ‘లవ్ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న రాజీవ్ కనకాల తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ‘మా’ ఎలెక్షన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికలో శివాజీరాజా ప్యానెల్ నుంచి పోటీ చేసి కోశాధికారి పదవి పొందానని.. ఆ ప్యానెల్ నుంచి తనొక్కడినే గెలిచానని అన్నారు.

నరేష్ టీమ్ తో కలిసి సభ్యుల సంక్షేమం కోసం ఎంతో పని చేశానని.. అవకాశాల్లేని ఎంతోమంది ఆర్టిస్టుల కోసం కష్టపడ్డామని.. 40 మందికి అవకాశాలు వచ్చేలా చేశామని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లు మాత్రం తమ గురించి ఎన్నో కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో తను విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. విష్ణుకి ‘మా’ బిల్డింగ్ నిర్మాణం, సభ్యుల సంక్షేమంపై పూర్తి స్పష్టత ఉందని..

ఆయన తప్పకుండా గెలుస్తారని అన్నారు. అలానే మంచు విష్ణుకి బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ లో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా ఇతర నటీనటులు కూడా ఆయనకే మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. అలానే మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అతడికి మర్యాదలు చేసి.. అన్ని రకాలుగా ఆతిథ్యం కల్పిస్తానని.. కానీ మా ఇంటి సమస్యల్లో అతడు పెద్దరికం తీసుకుంటే నేనెందుకు ఒప్పుకుంటాను..? అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus