Rajeev Kanakala: తమ విడాకుల వార్తలపై స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాజీవ్ కనకాల!

యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను ఓ యాంకర్ గా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తుంటారు ప్రేక్షకులు. ఏ సినిమా ఫంక్షన్ జరిగినా సుమ యాంకరింగ్ చేయకపోతే ఆ ఈవెంట్ కి అందం రాదు. ఇదిలా ఉండగా.. సుమ తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుంది అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదు అని సుమ చాలా సార్లు క్లారిటీ ఇచ్చిన ఇవి ఆగడం లేదు.

తాజాగా తన భర్త రాజీవ్ (Rajeev Kanakala) కూడా ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “విడాకుల వార్తలు నాకు కొత్త కాదు. నేను, సుమ విడిపోతున్నామని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతుంది. వీటి పై స్పందించి.. అవి నిజం కాదు అని క్లారిటీ ఇచ్చినా.. ఆ ప్రచారం ఆపడం లేదు. నేను సుమ హోస్ట్ చేస్తున్న షోలకి వెళ్లొస్తున్నాను. ఈ మధ్యనే కలిసి అమెరికా వెళ్ళొచ్చాము.

అక్కడ రీల్స్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాము. మేము కలిసే ఉన్నాము అని చెప్పడానికి ఇంతకు మించి ఏ చేయాలో మాకు అర్ధం కావడం లేదు.ఇలాంటి రూమర్స్ మాకు అలవాటైపోయాయి. వీటి పై స్పందించి.. స్పందించి చిరాకొస్తుంది. అయినా ఇలాంటి వార్తల వల్ల మాకు ఇబ్బంది లేదు.

ఇబ్బంది పడుతున్నది మా పిల్లలు. స్కూళ్లల్లో, కాలేజీల్లో.. వాళ్ళ ఫ్రెండ్స్ ‘మీ అమ్మ, నాన్న విడిపోతున్నారు అంట కదా’ అంటూ అడిగితే వాళ్లకి కష్టంగా ఉంటుంది. మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకునైనా మా విడాకుల వార్తలను పుట్టించడం మానేస్తే బాగుంటుంది” అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus