సమ్మర్ కు సిద్ధమవుతున్న రజనీకాంత్ ‘కబాలి’

రజనీకాంత్ మాఫియా డాన్ గా నటించిన ‘బాషా’ చిత్రం ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. మళ్లీ రజనీ మాఫియా డాన్ గా నటిస్తే చూడాలన్న అభిమానుల కోరికను నెరవేరుస్తూ ‘కబాలి’ తయారవుతోంది. ఇందులో ఆయన మాఫియా డాన్ గా డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన చిత్రాలన్నింటిలోకీ ఈ చిత్రం గెటప్ కి భారీ ఎత్తున స్పందన లభించింది. నాటి ‘భాషా’లో కనిపించినట్లుగా ఎంతో స్టయిలిష్ గా ‘కబాలి’లో రజనీ కనిపిస్తారని ఫస్ట్ లుక్ స్పష్టం చేసింది. తమిళంలో పలు భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ‘కలైపులి’ థాను ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఇందులో చైనా సూప‌ర్‌స్టార్ విల్స‌న్ చౌ విల‌న్‌గా న‌టించడం విశేషం.

ఈ సందర్భంగా ‘కలైపులి’ థాను మాట్లాడుతూ – “ఇటీవల మలేసియాలో జరిపిన భారీ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్ ను, రెండో వారంలో పాటలను, మేలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రజనీకాంత్ హీరోగా సినిమా నిర్మించాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరింది. ఈ చిత్రానికి మంచి కథ కుదరడం, ఇప్పటికే రజనీ లుక్ కి మంచి స్పందన రావడంతో ఆనందంగా ఉంది. రజనీ లుక్, కబాలీగా ఆయన నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటలన్నీ బాగా కుదిరాయి. మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఇవ్వబోతున్నాం. వేసవి సెలవులకు ఇదొక మంచి సినిమా అవుతుంది” అని చెప్పారు.

ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, థ‌న్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: సిరివెన్నెల‌, చంద్ర‌బోస్‌, అనంత‌శ్రీరామ్‌, మేక‌ప్‌: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: `దేవి-శ్రీదేవి` స‌తీష్‌, నిర్మాత‌: క‌లైపులి.ఎస్‌.థాను.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus