రాజకీయ రంగ ప్రవేశం గురించి రజనీకాంత్!

  • May 15, 2017 / 09:26 AM IST

సూపర్ స్టార్ రజనీ కాంత్  ని తమిళీయులు చాలామంది దేవుడిగా భావిస్తుంటారు. అతను రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించాలని అభిమానులు కోరుకున్నారు. దేశంలోని పెద్ద పార్టీలు కూడా ఆయన్ను ఆహ్వానించాయి. కానీ రజనీ ఆసక్తి చూపలేదు. తొలిసారి తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సోమవారం రజనీకాంత్‌ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. అభిమానులతో మాట్లాడుతూ మద్యానికి అలవాటుపడొద్దని సలహా ఇచ్చారు.

ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ తన భవిష్యత్తును ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని చెప్పారు. అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1996లో డీఎంకేకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని ఆనాటి తప్పిదానికి బాధపడ్డారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడుకున్నారని రజనీ తెలిపారు ఈ మాటలను బట్టి చూస్తే రజనీ రాజకీయాల్లోకి రావడం తధ్యమని తెలుస్తోంది.  నేటి నుంచి ఐదురోజుల పాటు అభిమానులతో కలిసి రజనీ మాట్లాడనున్నారు. అందరి సలహా మేరకు కొత్తపార్టీ పెట్టాలా? ఉన్న పార్టీలోకి వెళ్లాలా? అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఏంటో ఈ వారంలో తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus