రజినీ వద్దని చెప్పినా వినకుండా సినిమా చేసి భారీ నష్టాలు చవి చూశారట..!

కథ ఒకటి అయితే తెరపైకి అది మరోలా కూడా మారొచ్చు..! ఇప్పటి హీరోలు చాలా వరకూ సినిమా ఫలితం ఏంటనేది సరిగ్గా అంచనా వేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, రజినీ కాంత్, నాగార్జున వంటి వారు చాలా వరకూ సినిమా ఆడుతుందా.. లేదా.. ? అనేది చెప్పేయగలరు. అలా ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా కచ్చితంగా ప్లాప్ అవ్వుద్ది.. ఆ సినిమా నిర్మించకండి అని రజినీ కాంత్ ముందే నిర్మాతకి చెప్పేశారట.

అసలు విషయానికి వెళితే.. ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘శక్తి’ చిత్రం ప్లాప్ అవుతుందని.. నిర్మాత అశ్వినీదత్ కు ముందే చెప్పేసారట రజినీ. ‘కథానాయకుడు’ అనే చిత్రం కోసం రజినీకాంత్ ను కలవడానికి వెళ్ళిన అశ్వినీదత్ గారు.. ఆ సందర్భంలో ఇలా భారీ బడ్జెట్ తో ‘శక్తి’ సినిమా నిర్మిస్తున్నట్టు.. కథ, కథనాలతో రజినీ కి వివరించారట మన దత్ గారు. అయితే ‘శక్తి పీఠాల పై సినిమా తీయడం అంత మంచిది కాదు.. పైగా పెద్ద బడ్జెట్ అంటున్నారు.. దయచేసి ఆ సినిమా చేయకండి అని’ దత్ గారికి రజినీ ముందే చెప్పారట. ఈ విషయాన్నీ ఇటీవల అశ్వినీదత్ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus