2020 సంక్రాంతి టార్గెట్ గా ‘దర్బార్’

‘పేట’ చిత్రం తరువాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈరోజు ముంబై లో పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఈ కార్యక్రమంలో రజినీకాంత్,మురుగదాస్, సంతోష్ శివన్,శ్రీకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 20రోజుల వరకూ జరుగనుందట. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నడదట. లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రజినీ మనుమడు అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య రజినీకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక ఈమధ్య ‘118’ చిత్రంలో అద్భుతమైన నటన కనపరిచిన నివేధా థామస్ ఈ చిత్రంలో రజినీ కూతురిగా కనిపించనుంది. ‘లైకా ప్రొడక్షన్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా ఈచిత్రం ఏక కాలంలో విడుదల కానుందని సమాచారం. మొదటి సారి ‘రజినీ- మురుగదాస్’ కాంబినేషన్లో వస్తున్న ఈ ‘దర్బార్’ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus