సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ఐశ్వర్య డైరెక్షన్ లో తెరకెక్కిన లాల్ సలామ్ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. గత కొన్నేళ్లలో రజనీకాంత్ నటించిన సినిమాలలో ఈ స్థాయిలో డిజాస్టర్ అయిన సినిమా లేదు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడం గురించి ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లాల్ సలామ్ సినిమాకు సంబంధించిన మొదట అనుకున్న కథ వేరని రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తానని చెప్పిన తర్వాత ఈ సినిమా కథ మారిపోయిందని ఆమె తెలిపారు.
మొదట రజనీకాంత్ పోషించిన పాత్ర నిడివి పది నిమిషాలు మాత్రమేనని ఇంటర్వెల్ తర్వాత ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. రజనీ పాత్ర నిడివి పెంచినా పరవాలేదని చెప్పడంతో స్క్రీన్ ప్లే మారిపోయిందని ఐశ్వర్య వెల్లడించారు. ఐశ్వర్య రజనీకాంత్ ఎన్ని కారణాలు చెప్పినా మంచి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ మరోసారి కూతుళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దని నెటిజన్లు కోరుతున్నారు. రజనీకాంత్ ఈ జనరేషన్ ప్రేక్షకులకు అనుగుణంగా కథలను ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్ పారితోషికం యంగ్ జనరేషన్ హీరోలతో సమానంగా ఉంది. ఈ జనరేషన్ యూత్ సైతం రజనీకాంత్ ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.
ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులు రజనీకాంత్ తో ఒక సినిమా చేసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా రజనీకాంత్ కూతుళ్లు మాత్రం ఆయనతో సినిమాలను తెరకెక్కించి ఘోరమైన ఫ్లాపులను ఇస్తున్నారు. రజనీకాంత్ గెస్ట్ రోల్స్ కు దూరంగా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?