సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించని విధంగా సంచలనమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నటువంటి తరుణంలో రజనీకాంత్ పలువురు యోగులను మునులను కలుస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసిన సంగతి తెలిసిందే. అయితే యోగి ఆదిత్యనాథ్ ను కలిసినటువంటి రజనీకాంత్ కారు దిగిన వెంటనే ఆయనకు పాదాభివందనం చేశారు. రజనీకాంత్ కు స్వాగతం పలకడానికి యోగి ఆదిత్యనాథ్ రావడంతో కారు దిగిన వెంటనే రజనీకాంత్ ఆయనకు పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ విషయంపై ఎంతోమంది రజినీకాంత్ పట్ల విమర్శలు కురిపించారు.రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ ఆయన కన్నా వయసులో 20 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్ళు మొక్కడం ఏంటి అంటూ పలువురు ఈ విషయం పట్ల భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా తన ట్రిప్ పూర్తి చేసుకొని రజనీకాంత్ చెన్నైలో అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే ఈయన ఎయిర్ పోర్ట్ లోకి రాగానే రిపోర్టర్స్ ఆయనని ఈ వివాదం గురించి ప్రశ్నించారు.ఇలా తమకన్నా వయసులో చిన్న వ్యక్తికి కాళ్ళు మొక్కడం ఏంటి అంటూ రజనీకాంత్ కు ప్రశ్న ఎదురయింది రజినీకాంత్ సమాధానం చెబుతూ… వయసులో నాకన్నా చిన్న వారు అయినా వాళ్లు యోగి లేదా స్వామీజీ అయితే వాళ్లు కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం నా పద్ధతి అంటూ ఒక్క మాటతో ఈయన ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.